మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్ధిని ఆత్మహత్య .. కారణం ఏమిటంటే..?
- తండ్రి మరణాన్ని తట్టుకోలేక ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య
- హైదరాబాద్ మైసమ్మగూడలోని హాస్టల్లో ఘటన
- తండ్రి మృతితో మనస్తాపం చెందానని సూసైడ్ నోట్లో వెల్లడి
- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పేట్‌బషీరాబాద్ పోలీసులు
హైదరాబాద్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కన్నతండ్రి మరణాన్ని జీర్ణించుకోలేని ఓ కుమార్తె, తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. ఈ హృదయ విదారక ఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న జరిగింది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడకు చెందిన పి. జ్ఞానశ్రీ (21), మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. స్థానికంగా ఓ మహిళల హాస్టల్లో ఉంటోంది. గత నెల 31న ఆమె తండ్రి చెన్నకేశవులు మరణించడంతో, జ్ఞానశ్రీ సొంతూరుకు వెళ్లి అంత్యక్రియలు పూర్తిచేసింది. రెండు రోజుల క్రితమే తిరిగి హాస్టల్‌కు వచ్చింది.
తండ్రి మరణించినప్పటి నుంచి తీవ్ర దుఃఖంలో ఉన్న ఆమె, నిన్న మధ్యాహ్నం తన హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. "తండ్రి మరణంతోనే మనస్తాపం చెంది ఈ నిర్ణయం తీసుకుంటున్నాను" అని ఆమె రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.